Rashmi Gautam : పుష్ప సినిమా తరువాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలను సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీల అనంతరం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన 777 చార్లీ అనే మూవీ కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇందులో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నటించాడు. కాగా ఈ సినిమాకు చాలా మంది సెలబ్రిటీల ప్రశంసలు దక్కాయి. జూన్ 10న రిలీజ్ అయినఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సాధించి కలెక్షన్ల వసూలు దిశగా ముందుకు సాగుతోంది.
అయితే 777 చార్లీ మూవీలో కుక్కకు సంబంధించిన కథను చూపించారు. హీరో యాంత్రిక జీవితం గడుపుతుండగా.. అతని లైఫ్‌లోకి అకస్మాత్తుగా ఓ కుక్క వస్తుంది. దీంతో అతని జీవితం మారిపోతుంది. తరువాత ఏం జరిగిందన్నది సినిమా కథ. అయితే స్వతహాగా కుక్కలు అంటే ఇష్టం ఉండే యాంకర్ రష్మి గౌతమ్ ఈ మూవీ పట్ల స్పందించింది. ఈ మూవీ గురించి ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇంతకీ రష్మి గౌతమ్ ఏమన్నదంటే..

777 చార్లీ సినిమా చాలా బాగుంది. మీరు జంతు ప్రేమికులు అయినా కాకపోయినా ఈ మూవీ మీ హృదయాన్ని కదిలిస్తుంది. చార్లి అనే కుక్క చాలా అద్భుతంగా చేసింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పక చూడాలి.. అని రష్మి గౌతమ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా కన్నడ భాషలో తెరకెక్కిన ఈ మూవీ మొత్తం 5 భారతీయ భాషల్లో రిలీజ్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టితోపాటు సంగీత శృంగేరి డానిష్ సెయిట్, బాబీ సింహా, రాజ్ బి శెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ మూవీ హిందీ వెర్షన్‌లోనూ రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ మూవీని ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా చాలా బాగుందని వారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే రష్మి గౌతమ్ ఈ సినిమా గురించి కామెంట్స్ చేయడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.