Rashmi Gautam : బుల్లితెర మీద మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. ఉదయ్ కిరణ్ నటించిన హోలీ చిత్రంతో రష్మి గౌతమ్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే, మరోవైపు సినిమా అవకాశాలు దక్కించుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ.. విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది రష్మి. ఇక రష్మికి క్రేజ్ వచ్చింది మాత్రం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహిస్తున్న జబర్దస్త్ షో ద్వారానే.
అనసూయ పుణ్యమా అని ప్రస్తుతం రష్మి గౌతమ్ చేతినిండా సంపాదించుకుంటుంది. అనసూయ కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ షోకి దూరం అయింది. మొదట్లో జబర్దస్త్ లో అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రష్మి గౌతమ్ యాంకర్స్ గా వ్యవహరించేవారు. రీసెంట్ గా అనసూయ జబర్దస్త్ షోకి దూరం కావడంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలకు కూడా యాంకర్ గా రష్మి ఆఫర్ కొట్టేసింది.

ప్రస్తుతం ఇదే విషయంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ రష్మి ఎంత ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటుందో అనే చర్చలు నడుస్తున్నాయి. అనసూయ గతంలో కొన్ని షోలు చేసి వెళ్లిపోయిన తరువాత రష్మి జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటీ కూడా సంపాదించుకుంది. ఆ తరువాత కొంతకాలానికి జబర్దస్త్ రెండుగా విడిపోగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు రష్మి యాంకర్ గా మారింది. యాంకర్ గా రష్మి ఒక్క షోకు గతంలో రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ రెమ్యూనరేషన్ తీసుకునేదని సమాచారం.
అయితే రీసెంట్ గా జబర్ధస్త్ నుంచి అనసూయ వెళ్లిపోవడం రష్మికి బాగా కలిసి వచ్చింది. జబర్దస్త్ షో బాధ్యత కూడా రష్మి మీదనే పెట్టారు మల్లెమాల సంస్థవారు. దాంతో రష్మీ రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది. ఎంతమంది జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయిన రష్మి మాత్రం జబర్దస్త్ ను వదలకుండా నమ్మకంగా పనిచేస్తూ ఉంటుంది. ఎంతో నమ్మకంగా పని చేస్తున్న రష్మికి మల్లెమాల సమస్థ అడిగినంత ముట్ట చెబుతుందట. ఇక జబర్దస్త్.. ఎక్స్‌ట్రా జబర్దస్త్ రెండు కలిపి ఒక ఎపిసోడ్ కి రూ.3 లక్షల పైనే వసూలు చేస్తోందట రష్మి.
ఒక జబర్దస్త్ లోనే కాకుండా, శ్రీదేవి డ్రామా కంపెనీ, పండుగల సందర్భంగా చేసే స్పెషల్ షోల ద్వారా కూడా రష్మి గౌతమ్ లక్షల రూపాయలలో ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో కూడా రష్మి మెరవనుంది.