Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే కాకుండా పలు స్పెషల్ ఈవెంట్ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటుంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల జరిగే దాడుల గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది.

ఈ విధంగా మూగజీవాల పట్ల జరిగే దాడుల గురించి ఎదిరించే రష్మి హోలీ సందర్భంగా పొరపాటున కూడా రంగులు జీవాలపై వేయకండి, వాటిలో రసాయనాలు ఉండటం వల్ల వాటిపై తీవ్రమైన ప్రభావాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.. అంటూ కోరింది. అయితే రష్మి ఇలా చెప్పినప్పటికీ కొందరు ఆకతాయిలు కావాలనే ఒక కుక్కను కట్టేసి దానిపై రంగులు చల్లారు. ఆ కుక్క ఎంత గట్టిగా అరుస్తున్నా వినిపించుకోకుండా వారు తమ ఆనందం కోసం ఆ కుక్కను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తప్పకుండా వారిని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధంగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా తక్కువ సమయంలోనే వారిని పట్టుకున్నారు. సోషల్ మీడియా కు ఉన్న పవర్ తో వారి ఆచూకీ కనుగొని వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. అయితే హోలీ జరుపుకున్న రెండు రోజులైనా ఆ కుక్కకు ఇప్పటి వరకు స్నానం చేయించక పోవడంతో రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.