Rashi Khanna : ప్రస్తుత తరుణంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అందులో భాగంగానే పలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తూ నిత్యం తమ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ఇక ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా వారు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఒక్క పోస్ట్ పెట్టి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఇక తాజాగా రాశి ఖన్నా కూడా సొంత యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసింది.
రాశి ఖన్నాకు ఇప్పటికే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో లక్షలకొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ఓ యూట్యూబ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
తన రియల్ లైఫ్‌కు చెందిన పలు విశేషాలతో కూడిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. తన చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని కోరింది. రాశిఖన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నాగచైతన్య సరసన ఆమె థాంక్ యూ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌తో కలిసి రుద్ర అనే థ్రిల్లర్ సిరీస్‌లోనూ ఆమె నటిస్తోంది.