Rashi Khanna : మిల్కీ వైట్ బ్యూటీగా పేరుగాంచిన రాశి ఖన్నాకు ఈమధ్య ఏమీ కలసి రావడం లేదు. ఈమె ఇటీవలి కాలంలో నటించిన ఏ ఒక్క తెలుగు మూవీ కూడా హిట్ కాలేదు. ఈ క్రమంలోనే రాశి ఖన్నా మంచి హిట్ కోసం చూస్తోంది. అయితే సినిమాలు హిట్ కాకపోయినా సోషల్ మీడియాను మాత్రం ఈమె షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను అందులో పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తెలుపు రంగు దుస్తుల్లో ఎద అందాలను చూపిస్తూ రాశి ఖన్నా రెచ్చిపోయింది. దీంతో ఆమె గ్లామర్ షోకు యువత ఫిదా అవుతున్నారు.

రాశి ఖన్నా తెలుగులో నటించిన ప్రతి రోజు పండుగే తరువాత ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఆ మూవీ తరువాత వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్ యూ చిత్రాల్లో నటించింది. ఇవన్నీ ఈ మధ్య రిలీజ్ అయినవే. కానీ ఒక్క హిట్ కూడా దక్కలేదు. దీంతో ఇతర భాషలకు చెందిన చిత్రాల్లో తన లక్‌ను పరీక్షించుకుంటోంది. ఈమె నటించిన తిరు మూవీ ఈ మధ్యే రిలీజ్ కాగా.. దీనిపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. కానీ ఈ మూవీకి కూడా ఆశించినంత టాక్ రావడం లేదు.
ఇక రాశి ఖన్నా ప్రస్తుతం తమిళంలో సర్దార్ అనే మూవీతోపాటు హిందీలో యోధా అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఈమెకు ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు. ఈ క్రమంలోనే తన కెరీర్ ముగిసినట్లేనా అని రాశి ఖన్నా ఆందోళన చెందుతుందని తెలుస్తోంది.