Rana : నాగచైతన్య గత రెండు చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం విదితమే. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల సక్సెస్‌తో చైతూ మంచి జోష్ మీద ఉన్నాడు. త్వరలోనే ఈయన నటించిన హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డా కూడా రిలీజ్ కానుంది. ఇందులో చైతూ అమీర్‌ఖాన్ తో కలిసి నటించాడు. ఇక మనం సినిమా ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్ యూ లోనూ చైతూ నటించాడు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలోంచి ఇటీవలే విడుదల చేసిన ఓ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చైతన్య ఈ మూవీలో స్వార్థపూరితమైన వ్యక్తిగా కనిపిస్తాడు. తరువాత మారిపోయి తనను తాను సరిచేసుకుంటున్న వ్యక్తిగా కనిపిస్తాడు. దీంతో లవ్ బ్రేకప్ అయ్యాక చైతూ తిరిగి లవ్‌లో ఎలా పడ్డాడు.. అన్న కథాంశం ఈ మూవీలో ఉంటుందని టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ లు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే టీజర్‌లో ఉన్న చైతూ డైలాగ్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.
నన్ను నేను సరిచేసుకునేందుకు యత్నిస్తున్నాను, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, జీవితంలో చాలా వదులుకుని ఇక్కడివరకు వచ్చాను.. అని టీజర్‌లో చైతన్య డైలాగ్ ఉంది. అయితే దీన్ని సమంతకు ఆపాదిస్తున్నారు. ఈ డైలాగ్‌ను సమంత ఉద్దేశించే పెట్టి ఉంటారని చర్చ నడుస్తోంది. అయితే పుండు మీద కారం చల్లినట్లుగా చైతన్యకు చెందిన ఈ డైలాగ్స్ పై రానా కామెంట్లు చేశాడు. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్.. అని రానా ట్వీట్ చేశారు. దీంతోపాటు చిత్ర యూనిట్‌కు రానా బెస్టాఫ్ లక్ చెప్నారు. దీంతో రానా కూడా సమంతను ఉద్దేశించే ఆ కామెంట్స్ చేసి ఉంటాడని అంటున్నారు.
అంటే సమంతను విడిచిపెట్టిన తరువాతనే నాగచైతన్య సరి అయ్యాడా.. అని నెటిజన్లు రానాను అడుగుతున్నారు. సమంతకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాకే చైతూ ఒక దారిలోకి వచ్చాడా.. రానా అన్న.. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వు.. అని అడుగుతున్నారు. అయితే రానా సమంతను ఉద్దేశించి ఆ విధంగా కామెంట్లు పెట్టి ఉండకపోవచ్చు. కానీ తీవ్రంగా ఆలోచిస్తే ఆ కామెంట్లలో అంతరార్థం కూడా ఉంది. మరి చైతన్య థాంక్ యూ మూవీ రిలీజ్ అయ్యాక అందులో ఇంకా ఇలాంటి డైలాగ్స్ ఎన్ని ఉంటాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…