Rana Daggubati : రామానాయుడి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా దగ్గుబాటి మాత్రం ఇంకా స్టార్ హీరో బేస్ సంపాదించుకోలేదనే చెప్పవచ్చు. మంచి నటుడిగా రానాకు ఫుల్ మార్క్స్ పడ్డప్పటికీ, స్టార్ హీరో అనేటప్పటికి ఆలోచించాల్సి వస్తుంది. అందుకు రానా సెలెక్ట్ చేసుకునే స్టోరీలే కారణంగా చెప్పవచ్చు. మొదట లీడర్, కృష్ణం వందే జగద్గురం, ఘాజీ వంటి సినిమాలతో రానాకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వచ్చిన బాహుబలి వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అవ్వడంతో రానా భల్లాల దేవుడిగా అందరికీ గుర్తుండిపోయాడు. ఇంత గుర్తింపు వచ్చిన తరువాత రానా కెరీర్ అద్భుతంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఏర్పడింది.
కానీ హీరో కన్నా విలన్ పాత్రలనే ఎక్కువ ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ విలన్ గా సెటిల్ అయిపోయాడు. రీసెంట్ గా రానా దగ్గుబాటి డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన బాబాయ్ వెంకటేష్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. దీనికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ఒరిజినల్ గా నిర్మితమవుతున్న రానా నాయుడు అనే వెబ్ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో హీరో వెంకటేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. కచ్చితంగా ఈ సిరీస్‌లో వెంకటేష్ నటనకి మంచి మార్కులు పడే అవకాశం ఉంది.
అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ లో రానా దగ్గుబాటి హద్దులు మీరి నటించినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో రానా లిప్ కిస్సులతో రెచ్చిపోయాడు. వాస్తవానికి రానా లిప్ కిస్ కి, బెడ్ సీన్స్ కి, బోల్డ్ సన్నివేశాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. కానీ ఈ కంటెంట్ లో భాగంగానే రానా దగ్గుబాటి అలా చేశాడని తెలుస్తుంది. అంతేకాదు దీనిపై ముందుగానే ఆయన భార్య మిహికాకు చెప్పడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే రానా దగ్గుబాటి అలా ఆమెతో లిప్ లాక్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ ద్వారా అబ్బాయ్, బాబాయ్ ఎలాంటి పేరు తెచ్చుకుంటారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…