సినిమా ఇండస్ట్రీ అంటేనే అంత. కొందరు హీరోలు తమ వద్దకు వచ్చే కథలను రిజెక్ట్ చేస్తారు. అయితే అవే కథలతో వేరే హీరోలు సినిమాలు తీసి హిట్ కొడతారు. ఇంకా చెప్పాలంటే.. అలా కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన కథలను ఇంకొందరు హీరోలు తీసి రికార్డులను కొల్లగొడుతుంటారు. ఇలా చాలా మంది హీరోలకు జరుగుతూనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే.. అప్పట్లో చిరంజీవి చేయాల్సిన సినిమా. కానీ కథ నచ్చలేదని ఆయన రిజెక్ట్ చేశారు. దీంతో రజనీకాంత్ అదే కథను ఓకే చేశారు. ఫలితంగా ఆ మూవీతో రజనీ హిట్ కొట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి రికార్డులను బ్రేక్ చేసింది. ఇంతకీ అసలు ఆ మూవీ ఏదంటే..
అప్పట్లో మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మణిచిత్ర తాల్. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 1993లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు రీమేక్ గా 2004 లో కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విష్ణువర్థన్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.
కాగా ఇదే సినిమాను తమిళ్ లో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్ ల్ తో తెరకెక్కించారు. అంతే కాకుండా ప్రభు ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాలో జ్యోతిక, నయనతార హీరోయిన్ లు గా నటించారు. ఈ సినిమాకు మొదట నాగవల్లి అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ రజినీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ ను సూచించడంతో అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2005లో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్షకులు థియేటర్ లలో జ్యోతిక నటనకు తీవ్రంగా భయపడిపోయారు.
అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా డబ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే నిజానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య ఆప్తమిత్ర సినిమా చూడాలని చిరంజీవికి ముందుగానే సీడీని పంపించాడు. ఇక ఆ సినిమాను చూసిన చిరు రిజెక్ట్ చేశారు. ఆయనకు చంద్రముఖి కథ నచ్చలేదు. దీంతో రజనీ ఆ మూవీని చేశారు. రికార్డులను బ్రేక్ చేశారు. అయితే చంద్రముఖి విడుదలయ్యాక చిరు వీఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి ఆయనను అభినందించాడు. అలా చిరు రిజెక్ట్ చేసిన కథతో రజినీ రికార్డులు క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఒక మంచి మూవీని మిస్ అయ్యారని చెప్పవచ్చు. లేదంటే ఆయనకు క్రేజ్ మరింతగా పెరిగేది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…