Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ తోపాటు నరేష్ భార్య రమ్య రఘుపతిల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వీరు ఓ చానల్ చర్చలో పాల్గొని ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రమ్య డబ్బు పిచ్చి ఉన్న మనిషని నరేష్ అనగా.. తనకు గన్ గురి పెట్టి విడాకులు కావాలని నరేష్ బెదిరించారని.. రమ్య ఆరోపించారు. అలాగే తాను నరేష్‌తో కలసి ఉంటున్నానని.. తనకు సపోర్ట్ ఇవ్వాలని మరోవైపు పవిత్ర లోకేష్ ప్రేక్షకులను కోరారు. ఇలా వీరి వ్యవహారం అనేక ట్విస్టులతో ముందుకు సాగుతోంది. అయితే తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ ఒక హోటల్ గదిలో ఉండగా.. వారిని రమ్య రఘుపతి పట్టుకున్నారు.
మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్, పవిత్ర లోకేష్ ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడికి వెళ్లారు. వారిని హోటల్ గదిలో ఆమె పట్టుకున్నారు. అయితే కోపంతో రగిలిపోయిన రమ్య.. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని రమ్యను, నరేష్, పవిత్రలను వేరు చేసి పంపించేశారు. నరేష్ రమ్య వైపు చూస్తూ విజిల్స్ వేస్తూ పవిత్రతో కలిసి అక్కడి నుంచి లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. ఈ సంఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై రమ్య మాట్లాడారు.

నరేష్, పవిత్ర ఇద్దరూ ఒకే హోటల్ గదిలో ఉన్నారని తనకు తెలిసిందని.. కనుకనే ఈ హోటల్‌కు వచ్చానని రమ్య తెలిపారు. రాత్రంతా వారు గదిలోనే ఉన్నారని.. అయితే రాత్రి పూట గొడవ చేయడం ఎందుకని చెప్పి తెల్లారే వరకు వెయిట్ చేశానన్నారు. ఈ క్రమంలోనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని తెలిపారు. ఒక మహిళ భర్తతో కాకుండా రాత్రి పూట ఇంకో మగాడితో హోటల్ గదిలో ఉండడమేమిటని ఆమె ప్రశ్నించారు. నరేష్ తనను బెదిరిస్తుండడమే కాకుండా తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారని.. ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని.. తన కొడుక్కి తండ్రి కావాలని ఆమె అన్నారు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.