Ramya Krishnan : 1990 దశాబ్దంలో కుర్రకారు మధ్యలో రమ్యకృష్ణకి ఉండే క్రేజే వేరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రమ్యకృష్ణ నటన గురించి వేరే చెప్పనవసరం లేదు. నీలాంబరి, శివగామి లాంటి ఎన్నో పాత్రలను అవలీలగా పోషించ గలదు. అప్పట్లో రమ్య కృష్ణ సినిమా వస్తుందంటే చాలు కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు.
ప్రస్తుతం రమ్యకృష్ణ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా కనిపించబోతుంది. ఈ నెల ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో భారీ ఎత్తున చిత్ర ప్రమోషన్ లు నిర్వహించడంలో బిజీగా ఉన్నారు పూరీ జగన్నాథ్ బృందం.

ఇందులో భాగంగానే ముంబైలో రమ్యకృష్ణ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఆ సమయంలోనే బయటకు వస్తూ ఫోటోగ్రాఫర్ల కంటికి చిక్కింది రమ్యకృష్ణ. ఉల్లిపొరలాంటి తేలికైన చీర కట్టుకొని ఇప్పటి తరం హీరోయిన్లను తలదన్నేలా కుర్రకారు మతులు పోగొడుతోంది. మీడియాతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో చిరుగాలికి ఆమె కట్టుకున్న చీర చెదురుతుంటే సరిదిద్దుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఈ వయసులో నీకు ఇలాంటి చీర అవసరమా అంటూ కామెంట్లు చేస్తూ రమ్యకృష్ణను విమర్శిస్తున్నారు. ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram