Ramarao On Duty : మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ.. రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్, రాజిషా విజయన్‌లు నటించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. చిత్ర యూనిట్ ఈ మూవీని యాక్షన్ ఎంటర్‌టైనర్ థ్రిల్లర్ మూవీగా ప్రమోట్ చేశారు. కానీ ఈ చిత్రం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది.
అయితే కొత్త సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యాక 4 వారాల్లోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు కూడా మారిపోయారు. నాలుగు వారాలు పోయాక ఓటీటీలోనే చూద్దామని అనుకుంటున్నారు. అందువల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. ఇక రామారావు ఆన్ డ్యూటీ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. దీనికి గాను డిజిటల్ హక్కులను ఇప్పటికే సోనీ లివ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యాప్‌లోనే రామారావు ఆన్ డ్యూటీ మూవీ రిలీజ్ కానుంది.

ఇక ఇప్పటికే సోనీ లివ్ ఈ మధ్య రిలీజ్ అయిన రెండు సినిమాల హక్కులను దక్కించుకుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు, ఎఫ్3 మూవీలు సోనీ లివ్ వద్దే ఉండగా.. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ కూడా వచ్చి చేరింది. ఈ క్రమంలోనే కొత్త సినిమాల హక్కులను పొందడంలో సోనీ లివ్ ఇతర ఓటీటీలకు బాగానే పోటీని ఇస్తుందని చెప్పవచ్చు. ఇక రామారావు మూవీని 4 వారాల్లో రిలీజ్ చేసేట్లు డీల్ కుదుర్చుకున్నారు. కనుక ఈ మూవీ ఆగస్టు 29 వరకు ఓటీటీలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. అయితే సినిమా ఫ్లాప్ అయితే ఇంకా త్వరగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే సినిమా ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు.