Ram Pothineni : ఒక హీరో స్టార్ గా సక్సెస్ అవ్వాలంటే కథ ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కంటెంట్ బాగున్నప్పుడు మాత్రమే ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరిస్తారు. హీరోలు కథ ఎంచుకునే టైంలో ఈ కథ సక్సెస్ కాదు అని భావించి వదులుకోవటం జరుగుతుంది. కానీ అదే సినిమా అవకాశం మరో హీరో దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంటారు. పాపం ఇలాంటి పరిణామమే యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి ఎదురైంది.
లింగస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్. జూలై 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దర్శకుడు లింగుస్వామి ది వారియర్ మూవీని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాడు. రెండు భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయగా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని తొలిసారిగా పోలీస్ క్యారెక్టర్ లో నటించారు.
ఈ మూవీ ప్రమోషన్స్ లో రామ్ పోతినేని ఒక కామెంట్ చేశారు. నేను నాలుగైదు పోలీస్ స్టోరీస్ విన్నాను. ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. దీంతో పోలీస్ స్టోరీస్ చేయకూడని డిసైడ్ అయ్యానని తెలియజేశారు. ఆ తరువాత లింగుస్వామి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా నిర్ణయం మార్చుకొని ది వారియర్ చిత్రం చేశాను. రామ్ కెరీర్ లో మొదటిసారిగా పోలీస్ పాత్ర ట్రై చేయగా అది కాస్త బెడిసికొట్టింది. అయితే రామ్ రిజెక్ట్ చేసిన ఆ నాలుగైదు పోలీస్ స్టోరీస్ స్క్రిప్ట్స్ లో క్రాక్ కూడా ఒకటి.
దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజ కంటే ముందు క్రాక్ స్క్రిప్ట్ రామ్ కి వినిపించారట. క్రాక్ స్టోరీ నచ్చకపోవడంతో రామ్ రిజెక్ట్ చేశాడట. ఈ ఛాన్స్ కాస్త రవితేజ చెంతకు చేరింది. క్రాక్ చిత్రం సక్సెస్ తో రవితేజ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. 2021సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. అలా రామ్ సూపర్ హిట్ సినిమా క్రాక్ మూవీని మిస్ చేసుకుని అట్టర్ ఫ్లాప్ సినిమా దివారియర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దెబ్బైపోయాడు.
ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం అనంతరం రామ్ చేసిన రెడ్, ది వారియర్ వరుసగా ప్లాప్ అవ్వటంతో ఇక రామ్ ఆశలన్నీ బోయపాటి శ్రీను మూవీ పైనే ఉన్నాయి. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. అఖండ సినిమా అనంతరం బోయపాటి శ్రీను నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి బోయపాటి శ్రీను చిత్రంతోనైనా హీరో రామ్ సక్సెస్ ని అందుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…