Ram Gopal Varma : సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదాస్పదం అవుతుంటుంది. తాజాగా ఆయన చేసిన పని కొన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) తాజాగా వరంగల్‌లో మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కొండను లాంచ్ చేశారు. అయితే ఆర్‌జీవీ మైసమ్మ తల్లి విగ్రహం మీద విస్కీ పోశారు. ఇది వివాదాస్పదంగా మారింది.
CHEERS! 🍾🍾🍾 pic.twitter.com/WXDMdZ4PcC
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021
Though I only drink Vodka, I made the Goddess Maisamma drink Whisky 😃 pic.twitter.com/rcwHc2DSde
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021
మైసమ్మ తల్లి మీద విస్కీ పోస్తున్న ఫోటోలను రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. వరంగల్ లోని మైసమ్మ తల్లి ఆలయం లోపలికి వెళ్తున్నానని, తాను కేవలం వోడ్కా మాత్రమే తాగుతానని, అయినా మైసమ్మ తల్లికి విస్కీ ఇచ్చానని, చీర్స్.. అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
Entering Maisamma temple in Warangal pic.twitter.com/DghG8euWvO
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021
అయితే ఆయన అలా చేయడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఆలయాల్లో దైవాలకు మద్యం నైవేద్యంగా ఇవ్వడం మామూలే అయినప్పటికీ విగ్రహాల మీద మద్యం పోయరని.. ఆలయం బయట అడ్డంగా నీరు పోసినట్లు మద్యం పోసి మొక్కులు తీర్చుకుంటారని.. కానీ విగ్రహాల మీద విస్కీ పోయరని.. కనుక తమ మనోభావాలను దెబ్బ తీసిన వర్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆర్‌జీవీ విస్కీ పోసిన సంఘటన తాలూకు ఫొటోలు వైరల్‌గా మారాయి.