Ram Gopal Varma : కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఒకప్పుడు అద్భుతమైన సినిమాలతో వార్తలలోకి ఎక్కేవారు. ఇప్పుడు మాత్రం వివాదాలతో సంచలనంగా మారుతున్నారు. మరోవైపు అన్ని జానర్స్ టచ్ చేస్తూ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మా ఇష్టం అనే పేరుతో ఇద్దరమ్మాయిల లవ్ స్టోరీని తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ పలు కారణాల వలన వాయిదా పడింది.
థియేటర్స్, మల్టీప్లెక్స్ లకు సంబంధించిన యాజమాన్యాలు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మా ఇష్టం వంటి వివాదాస్పద చిత్రాన్నిథియేటర్స్‌లో ప్రదర్శించబోమంటూ తెగేసి చెప్పారు. ఒకప్పడు తన సినిమాలతో దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్న ఈ దిగ్గజ దర్శకుడికి ఇంత అవమానం జరగడం ఆయన అభిమానులని చాలా బాధకి గురి చేసింది. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను మాత్రం తన పంథాను మార్చుకోడు. విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి సెటైర్స్ వేయడంలో ఓ అడుగు ముందే ఉంటాడు.
ఆచార్యలో చిరంజీవి యంగ్ ఏజ్ వీఎఫ్ఎక్స్ సీన్‌పై ఎన్ని సెటైర్స్ వచ్చాయో మనం అందరం చూశాం. పాత ఫొటోని తీసుకొని మేకర్స్ ఏదో ప్రయత్నాలు చేయగా అది దెబ్బకొట్టింది. ఇప్పుడు అదే స్టైల్‌లో రామ్ గోపాల్ వర్మ కూడా తన ఫోటోను ఎడిట్ చేసి షేర్ చేశాడు. తాను అలాంటి రియాక్షన్ ఎందుకు ఇచ్చానో చెప్పిన వారికి బహుమతి ఇస్తానంటూ వర్మ ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ ట్వీట్ ఆచార్య సినిమా గురించే అని కొందరు అంటున్నారు. ఆచార్య వీఎఫ్ఎక్స్ సీన్‌పైనే వర్మ ఇలా సెటైర్ వేసి ఉంటాడని చెప్పుకుంటున్నారు. ఆచార్యలో చిరంజీవి యంగ్ ఏజ్ సీన్‌ను చూసే వర్మ ఇలాంటి రియాక్షన్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్మ పోస్ట్ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…