Ram Charan Tej : ఎంతో మంది అక్రమార్కుల ఆట కట్టించి, ఆ చేతులతోనే ఎంతో మందికి ఆదర్శ పాఠాలు దిద్ది వారి జీవితాలలో సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. మహారాష్ట్రలో అడిషనల్ డీజీపీ హోదాలో పని చేసిన ఆయన 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన పార్టీలో చేరిన లక్ష్మీ నారాయణ.. విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు.
ఓటమి తర్వాత జనసేన నుంచి బయటకొచ్చిన ఆయన.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇప్పుడు ఆయన జీవితానికి సంబంధించి రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన చెర్రీ తన 15వ సినిమాగా, దిల్ రాజు బ్యానర్‌లో 50వ చిత్రంగా పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు.
పాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇందులో చరణ్ పాత్ర పోలీసు అధికారి నుండి రాజకీయ నాయకుడిగా మారిన జేడీ లక్ష్మీ నారాయణ జీవితాన్ని పోలి ఉంటుందని అంటున్నారు. సత్యం కుంభకోణం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసు వంటి అనేక పాపులర్ కేసులను డీల్ చేసిన జేడీ పాత్రలో చరణ్ నటిస్తున్నాడనే విషయం నిజమైతే సినిమాపై అంచనాలు భారీగా ఉండడం సహజం. మరి కథ అదే అయితే సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…