Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ నోటీసులు పంపారు. బన్నీ ర్యాపిడో అనే ప్రకటనలో నటిస్తుండగా, ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, ర్యాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసెను సిద్ధం చేస్తుందని బన్నీ పేర్కొన్నాడు. దీనిపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలో సజ్జనార్ బన్నీకి నోటీసులు పంపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోన్న టీఎస్‌ఆర్‌టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యంతోపాటు ఎవరూ హర్షించడం లేదు. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటులు నటించాలి. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉంది. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు ఇచ్చింది. బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, కరపత్రాలు అంటించే వారిపై, బస్సుల్లో, బయట పాన్, గుట్కా ఉమ్మేసే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నాం.. అని సజ్జనార్ తెలిపారు.
ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, వివిధ రంగాల ప్రముఖులు ఇలాంటి ప్రకటనలకు దూరంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పచిత్రంతో బిజీగా ఉండగా ఈ చిత్రం డిసెంబర్17న విడుదల కానుంది. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…