Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి చరణ్ ఆస్తుల విలువ. రామ్ చరణ్ లగ్జరీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిక్ గా మారింది. హీరో గానే కాకుండా, పలువు యాడ్స్ లో నటించడం ద్వారా, నిర్మాతగా కూడా చాలా ఆస్తుల సంపాదించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ ను ప్రారంభించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నెట్ వార్త్ దాదాపుగా 200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా రామ్ చరణ్ కు గుర్రాలు అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ కు 20 కోట్ల విలువ చేసే పోలో క్లబ్ కూడా ఉంది. రామ్ చరణ్ అపోలో ఎం.డి కూతురు ఉపాసనను 2012లో వివాహం చేసుకున్నారు. దాంతో రాంచరణ్ కు అపోలో ఆసుపత్రిలో సైతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు రామ్ చరణ్ వద్ద రోల్స్ రాయల్స్, రేంజ్ రోవర్, ఫెరారీ కార్లు ఉన్నాయి.
అంతేకాకుండా రామ్ చరణ్ చేతికి ధరించే గడియారం ధర 30 నుండి 75 లక్షల వరకు ఉంటుందట. ఇటీవల రాంచరణ్, ఉపాసన దంపతులు హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దాని విలువ సుమారు రూ.60 కోట్లు అని తెలుస్తోంది. ఇక దక్షిణాదిలో పరిశీలిస్తే ఇంత విలాసవంతమైన ఇల్లు కలిగిన హీరోల్లో రామ్ చరణ్ టాప్ అని ఓ ఆంగ్ల వెబ్‌సైట్ అంచనా వేయడం మరింత చర్చనీయాంశమైంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…