Jaggery : పూర్వకాలం నుంచి మన భారతీయ సంప్రదాయక వంటకాలల్లో ఎక్కువగా బెల్లం వాడటం అలవాటుగా వస్తుంది. ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లాన్ని మన పూర్వీకులు ఆయుర్వేద పరంగా ఔషధగుణాలు కలిగిన పదార్థంగా ఆమోదించడం జరిగింది. బెల్లంలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు కలుగుతాయి. కనుక పంచదారకు బదులుగా బెల్లం ప్రతిరోజూ తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
మరి బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాం.. ప్రతిరోజూ బెల్లం చిన్న ముక్క ఆహారంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే కడుపులో ఏర్పడే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ప్రేగులలో పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. బెల్లం మలబద్దకం సమస్యలను దూరం చేయడంలో మంచి ఔషధంగా పనిచేస్తుంది.
బెల్లం సహజసిద్ధమైన క్లీనింగ్ పదార్థంలా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తినడం వల్ల లివర్ శుభ్రంగా మారుతుంది. అందులో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలబద్దకంతో బాధపడేవారు నిత్యం బెల్లం తింటే ప్రయోజనం ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ మింగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మలబద్దకం సమస్య ఉండదు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేసే ఔషధ పదార్థంగా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
అలాగే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశయం, ఆహార నాళం అన్నీ శుభ్రమవుతాయి. బెల్లంలో ఉండే పోషకాలు మహిళలకు ఋతు సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. దీని వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. ఋతు సమయంలో స్త్రీలు బెల్లంను రోజూ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
బెల్లంలో ఐరన్, ఫోలేట్‌లు సమృద్దిగా ఉంటాయి. అందువల్ల దీన్ని తింటే రక్తం బాగా తయారవుతుంది. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం బెల్లం తింటే మంచిది. హైబీపీ సమస్య ఉన్నవారు నిత్యం బెల్లం తినడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చెవి నొప్పితో బాధపడేవారు బెల్లాన్ని నేతిలో ముంచి తినడం వలన చెవినొప్పి సమస్య తగ్గముఖం పడుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…