Ram Charan : గత కొంత కాలంగా దర్శకుడు శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో రాబోతున్న సినిమా వాయిదా పడిందని సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. శంకర్, కమల్ హాసన్ ల భారతీయుడు 2 సినిమా కోసం ఈ సినిమాను మధ్యలో ఆపేశారని వదంతులు వ్యాపించాయి. కానీ డెరెక్టర్ శంకర్ తన సోషల్ మీడియా పోస్టు ద్వారా ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. దీనితో ఇక రామ్ చరణ్ తో తాను చేయబోయే సినిమా వాయిదాపై ఉన్న ఊహాగానాలకు ముగింపు వచ్చేసిట్టే కనిపిస్తోంది.
ఇక శంకర్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేస్తూ.. రామ్ చరణ్ 15వ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో తిరిగి ప్రారంభం కానుందని, తరువాతి షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్ లలో జరుగుతుందని చెప్పారు. అలాగే భారతీయుడు 2 ఇంకా ఆర్‌సి15 సినిమాలు రెండూ ఏకకాలంలో జరుగుతాయని రాయడం జరిగింది.
దీంతో ఇప్పటివరకు నడుస్తున్న పుకార్లకు సమాధానం దొరికినట్టుగానే భావిస్తున్నారు. ఇక ఆర్‌సి 15 సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్, సునీల్ ఇంకా తమిళ నటుడు జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయుడు 2 లో కమల్ హాసన్ కు జోడీగా కాజల్ నటిస్తోంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ శంకర్ కెరీర్ లో ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…