Anasuya : జబర్దస్త్ ఫేమ్ అనసూయ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను చెప్పడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు. మహిళలను కించ పరిచే వారిని ట్విట్టర్ లో ఘాటైన పోస్టులతో విమర్శించడంలో ముందుంటుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో తనను హింసించే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే తనను ట్విట్టర్ లో ఆంటీ అని కామెంట్ చేస్తూ, కారణం లేకుండా తనని అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్న వారి పోస్టుల స్క్రీన్ షాట్ తీసిన ఆమె వారందరిపై కేసు నమోదు చేస్తానని, ఆ తర్వాత తన జోలికి వచ్చినందుకు వారు పశ్చాత్తాప పడాల్సి వస్తుందని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది.
అయితే అంతకుముందు ఆమె లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా.. అని ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ ను పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆయన చేసిన వాఖ్యలకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నట్టుగా ఆమె చేసిన ట్వీట్ వలన ఈ వివాదం మొదలైంది.
దీనిపై సోషల్ మీడియాలో అనసూయకు వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు బయటకు లాగి దాన్ని లైగర్ సినిమా ఫ్లాప్ తో ముడిపెట్టడం, తోటి సినిమా వాళ్లు బాధ పడుతుంటే ఆనందించడం ఏంటని ట్విట్టర్ లో అనసూయను ఆంటీ అని ఇంకా రకరకాలుగా కామెంట్ చేస్తూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
అయితే ఇలా తనను అకారణంగా ఏజ్ షేమింగ్ చేస్తూ మాటలతో హింసించే వారిపై లీగల్ చర్యలు తీసుకోవడానికి సైబర్ సెల్ తో మాట్లాడినట్లుగా చెబుతూ ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే విషయం గురించి చర్చిస్తున్నట్టుగా, వారు తనకు హామీ ఇచ్చారని ట్వీట్ చేసింది. అయితే ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…