Rakul Preet Singh : టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో వరుసగా అగ్రహీరోలందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ యాపిల్ బ్యూటీ. జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ల క్రితమే అధికారికంగా సోషల్ మీడియాలో తెలిపింది. ఆమె ప్రేమలో ఉన్నట్టు చెప్పిన దగ్గర నుండి పెళ్లికి సంబంధించి జోరుగా ప్రచారం నడుస్తోంది. మీడియా ముందుకొచ్చిన తనకు ప్రతిసారీ పెళ్లి ప్రశ్న కచ్చితంగా ఎదురు పడుతోంది. ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పెళ్లి గురించి ప్రశ్నించగా రకుల్ కొంచెం సీరియస్ గానే సమాధానమిచ్చింది.

తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా ఉంది. ఈ భామ ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. అజిత్ సరసన రకుల్ జతకడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏకే 61లో రకుల్ ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అజిత్‌తో రకుల్ రొమాన్స్ చేయబోతుందనే దానిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది.
ఇటీవల రకుల్ పలు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అందాల రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు తాజాగా బ్లాక్ కలర్ లో ఉన్న టైట్ ఫిట్ టాప్ లో ఎద సోయగాలు సమ్మోహనపరిచే విధంగా కనిపించి మైమరిపించింది. స్టైల్ గా కనిపిస్తూనే హాట్ గా రకుల్ అదరగొడుతోంది. ఇక వైట్ ప్యాంట్ ధరించి నడుము అందాల విందు వడ్డిస్తోంది. ఇలా రకుల్‌ని చూసిన కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం రకుల్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.