Rakul Preet Singh : తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉండేది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత నాన్నకు ప్రేమతో, కరెంట్ తీగ, ధ్రువ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయింది. అయితే కొత్త హీరోయిన్లు వస్తుండడంతో రకుల్‌కు సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీమె బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో మహర్జాతకురాలిగా వెలిగిపోయింది. కానీ బాలీవుడ్‌కు వెళ్లడంతో అక్కడ ఈమెకు అంతగా అవకాశాలు రాలేదు. మరోవైపు తెలుగు తెరకు కూడా దూరమైంది. అయితే బాలీవుడ్‌లో ఈమె నటించిన చిత్రాలు హిట్ అయితే బాగానే ఉండేది. కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అక్కడ అవకాశాల కోసం మళ్లీ ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే టాలీవుడ్‌లో ఉండి ఉంటే సమంత, తమన్నలా కాస్త పాపులారిటీ అయినా ఉండేది. దాంతో ఏదో ఒక మంచి మూవీలో చాన్స్ దక్కేది. కానీ ఆమె బాలీవుడ్‌కు వెళ్లడంతో అక్కడ ఫ్లాపై ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా ఆమె పరిస్థితి మారిపోయింది. అక్కడ, ఇక్కడా.. అసలు అవకాశాలు లేక దిక్కులు చూస్తోంది.
ఒకప్పుడు ఈమె రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకుంది. కానీ ఇప్పుడు రోజుకు రూ.3 లక్షలు ఇచ్చినా సరే నటిస్తానని చెబుతోందట. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఆమె బాలీవుడ్‌కు వెళ్లి అనవసరంగా తప్పు చేసిందని అంటున్నారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి మరీ దారుణంగా.. అత్యంత దయనీయంగా మారిందని అంటున్నారు. అదే.. మరి.. బళ్లు ఓడలు అవడం.. ఓడలు బళ్లు అవడం అంటే.. జీవితంలో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఏవిధమైన పరిస్థితికి చేరుకుంటారో.. ఎవరూ చెప్పలేరు. అందుకు రకుల్ జీవితమే ఉదాహరణ అని చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…