Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప రిలీజ్ అయి ఇప్పటికే 7 నెలలు కావస్తోంది. అయినప్పటికీ ఈ మూవీకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఎక్కడ చూసినా ఈ మూవీ పాటలు, డైలాగ్సే వినిపిస్తున్నాయి. ఇందులోని డైలాగ్స్ కు ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే పుష్ప క్రేజ్ ఖండాంతరాలకు పాకింది. ఇక పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
పుష్ప 2 సెప్టెంబర్‌లో లాంచ్ అయితే విడుదల వేసవిలోనే ఉంటుందని అంటున్నారు. కనుక 2023 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి పార్ట్‌లో ఉన్న పాత్రధారులే ఇందులోనూ చాలా వరకు కనిపించనున్నారు. కానీ కొందరు కొత్త నటులను ఇతర పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. మరోవైపు కథపై సుకుమార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే పుష్ప 2 గురించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి గాను రూ.350 కోట్లను బడ్జెట్‌గా ఫిక్స్ చేశారట. అలాగే ఇందులో నటీనటలుకు ఇవ్వనున్న మొత్తం గురించి కూడా వార్తలు వస్తున్నాయి.
పుష్ప 2కు గాను సుకుమార్, అల్లు అర్జున్, ఇతర నటీనటులకు కూడా భారీగానే రెమ్యునరేషన్‌ను అందించనున్నారని తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌కు గాను అల్లు అర్జున్ రూ.45 కోట్లను తీసుకున్నట్లు తెలుస్తుండగా.. రెండో పార్ట్‌కు రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్‌కు రూ.18 కోట్లను తీసుకున్నారట. దీంతో రెండో పార్ట్‌కు ఆయన రూ.45 కోట్ల మేర తీసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే ఇతర నటీనటులు, టెక్నిషియన్లకు రూ.75 కోట్ల వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు పైగానే అవుతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప 2కు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…