RRR Movie : సంచలన దర్శకుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా డీవీవీ దానయ్య దీనిని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్నఈ సినిమాలో, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తలు అభిమానులని థ్రిల్ చేస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 10,000 స్క్రీన్లలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రాన్ని 2022 జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతోపాటు పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది. యూఎస్ఏలోనే సుమారు 2500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. బాహుబలితో రికార్డులు సృష్టించిన జక్కన్న ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌తో వాటిని తిరగరాయాలని భావిస్తున్నాడు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర ఖని, శ్రియా, రాహుల్ రామకృష్ణ.. కీలక పాత్రలు పోషిస్తున్నారు.