Shilpa Shetty : అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం విదితమే. రాజ్ కుంద్రాను జూలై 2021లో అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. అయితే తాజాగా రాజ్ కుంద్రా తన భార్య శిల్పాశెట్టి పేరిట భారీగా ఆస్తులను ట్రాన్స్ ఫర్ చేశారు. మొత్తం రూ.38.5 కోట్ల విలువైన ఆస్తులను ఆమె పేరిట రాశారు. వాటిల్లో ముంబైలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ ఒకటి ఉంది. జుహులో ఉన్న 5 అంతస్థుల భవంతిలోని మొదటి ఫ్లోర్‌ను ఆమె పేరిట రాశారు.

సదరు ఫ్లాట్ విస్తీర్ణం 6000 చదరపు అడుగులు కాగా ఓ స్టిల్ట్ కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఆమె పేరిట ట్రాన్స్ ఫర్ అయింది. ఇందుకు గాను రూ.1.92 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు.
కాగా ఈ ఆస్తుల బదిలీకి చెందిన ప్రక్రియ జనవరిలోనే పూర్తయినట్లు సమాచారం అందుతోంది. జనవరి 21వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. అది జనవరి 24న పూర్తయింది. అయితే రాజ్ కుంద్రా తన ఆస్తులను శిల్పాశెట్టి పేరిట బదిలీ చేయడంతో.. వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. అందుకనే ఆమెకు ఆస్తులను ఇస్తున్నాడని సమాచారం.
కాగా రాజ్ కుంద్రా అరెస్టుతో శిల్పాశెట్టి పరువు మొత్తం పోయింది. ఆమెకు అది ఘోర అవమానమే అయింది. బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఎలాంటి సహకారం లభించలేదు. ఆ తరువాత చాలా రోజుల పాటు ఆమె సైలెంట్‌గా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ బయట ఈవెంట్లలో కనిపిస్తోంది. అయితే రాజ్ కుంద్రా తన భార్య శిల్పాశెట్టికి ఆస్తులను ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఉద్దేశమేమిటో తెలియాల్సి ఉంది.