Radhika Apte : తెలుగులో రక్త చరిత్ర సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. రాధికా ఆప్టే. తరువాత కూడా ఈమెకు పలు తెలుగు మూవీల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఈమెకు తరువాత ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో ఈమె లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈమె ఎక్కువగా బాలీవుడ్‌పైనే ఫోకస్ ఎక్కువగా పెట్టింది. అక్కడే పలు సినిమాలతోపాటు సిరీస్‌లోనూ నటించింది. ఈమె అప్పట్లో నటించిన ఓ చిత్రంలో పూర్తిగా నగ్నంగా కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. దీంతో అప్పట్లో ఆమె ఉన్న సీన్లు వైరల్ అయ్యాయి. అయితే తనకు తెలియకుండానే ఆ సీన్లను బయటకు విడుదల చేశారని.. ఆమె అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. కానీ తరువాత ఆ సీన్లపై ఆమె మళ్లీ మాట్లాడలేదు. ఇక రాధికా ఆప్టే మళ్లీ వార్తల్లో నిలిచింది.
రాధికా ఆప్టే ఇతర హీరోయిన్లలాగే తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఈమధ్య ఈమె హీరోయిన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తనను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్తనాలు పెద్దగా లేవని సర్జరీ చేయించుకోవాలని చెప్పారని.. అయితే తాను సహజసిద్ధమైన అందానికి ప్రాధాన్యతను ఇస్తానని చెప్పానని.. దీంతో తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పి వాపోయింది. ఇక తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తన అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో రాధికా ఆప్టేకు వింతైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈమెను తన వ్యక్తిగత, సినిమా కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. నీకు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు ఎందుకు.. అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.. అసలు నువ్వు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటి.. అని రాధికా ఆప్టే అడిగింది. అలాగే నీ వాట్సాప్ డీపీ ఏంటో చూపించాలని అడగ్గా.. ఆమె స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అలాగే నీ వయస్సు ఎంత అని అడగ్గా.. వచ్చే సెప్టెంబర్‌కు 37 ఏళ్లు నిండుతాయి.. అని చెప్పింది.
ఇక ప్రస్తుతం తాను ముంబైలోని బాంద్రాలో ఉంటున్నానని.. షూటింగ్‌లలో బిజీగా ఉన్నానని తెలియజేసింది. అయితే మీ అభిమాన నటుడు ఎవరు అని అడగ్గా.. సూపర్ స్టార్ రజనీకాంత్ అని చెప్పింది. అలాగే మీ భర్తలో మీకు నచ్చని విషయం ఏమిటి ? అని అడగ్గా.. ఆయన నాకన్నా చాలా పొడుగ్గా ఉంటారు.. అదే నచ్చదు.. అని ఆమె నాటీగా సమాధానం చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.