Radhe Shyam : బాహుబలి సినిమా విజయం హీరో ప్రభాస్ ని ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ ని చేసేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఆ ఖ్యాతిని అందుకున్న వాళ్లలో ప్రభాస్ మొదటి వ్యక్తిగా చెప్పవచ్చు. కానీ ఆ తరువాత ఆయన నుండి వచ్చిన సాహో సినిమా గానీ, రాధేశ్యామ్ కానీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాయి. మంచి ఓపెనింగ్ కలెక్షన్లతో సాహో కాస్త ఫరవాలేదనిపించినా, రాధేశ్యామ్ సినిమా మాత్రం దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి, అద్భుతమైన విజువల్స్ తో, గొప్ప ప్రేమ కథతో నిండిన దృశ్యకావ్యం అని చెప్పినప్పటికీ, అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోలేక తీవ్ర నిరాశకు గురి చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్ర యూనిట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే రాధేశ్యామ్ సినిమా విడుదలై 5 నెలలు గడుస్తున్నా ఇంకా ఆ చిత్రానికి ట్రోలింగ్ బెడద తప్పడం లేదు. అంటే ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగా నిరాశకు గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక దర్శకుడు రాధాకృష్ణ ను మాత్రం వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో ఒక ఆటాడుకుంటున్నారు. ఇక అప్పటి నుండి ఏదైనా సినిమా హిట్ అవడం ఆలస్యం, ఆ చిత్రాన్ని రాధేశ్యామ్ సినిమాతో పోలుస్తూ దర్శకుడు రాధాకృష్ణ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒకరి పెళ్లి ఇంకొకరి చావుకి కారణం అవడం అంటే ఇదేనేమో.
ఇలాగే ప్రేమకథ తో తీసిన సీతారామం సినిమా కూడా ఈ మధ్యే విడుదలై మంచి విజయం సాధించింది. దాంతో కొందరు అభిమానులు ఇదే హృదయాన్ని హత్తుకునే నిజమైన ప్రేమకథ అని, సీతారామం సినిమాని పొగుడుతూ, ఆర్టిఫిషియల్ ప్రేమకథలా ఉందని రాధేశ్యామ్ సినిమాని, ఆ చిత్ర దర్శకున్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
అంతే కాకుండా.. ఈ మధ్య చిన్న బడ్జెట్ తో విడుదలై ఉత్తరాదిన కూడా మంచి వసూళ్లు రాబడుతున్న కార్తికేయ 2 సినిమా ఇప్పటికే రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇంకా రాధేశ్యామ్ మొత్తంగా వసూలు చేసిన రూ.18 కోట్ల కలెక్షన్ల ను కూడా మించి వసూలు చేసేలా ఉంది. దీంతో కొందరు రాధేశ్యామ్ సినిమాను కార్తికేయ 2 సినిమాతో పోల్చి మళ్లీ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఇలాంటి ట్రోలింగ్ ల బారి నుండి ఈ సినిమా ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…