Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ నటించిన రొమాంటిక్ ప్రేమకథ. ఈ సినిమాలోని ‘నగుమోము తారలే’ పాటని ఈ రోజు విడుదల చేయనున్నారు. కొద్ది సేపటి క్రితం‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో (హిందీ వెర్షన్) ‘ఆషికీ ఆ గయి’ విడుదల చేశారు. ప్రభాస్, పూజాల పెయిర్ చాలా చాలా బాగుంది. లిరికల్‌గానూ, విజువల్‌గానూ సాంగ్ అదిరిపోతోంది.. అన్నట్లు హింట్ ఇచ్చింది ప్రోమో.
హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అర్జిత్ సింగ్ చాలా చక్కగా పాడారు. సాయంత్రం 7 గంటలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో రిలీజ్ కానుంది. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ రాబోతోంది. ‘‘ఇటలీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్ ప్రత్యేకమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఆయన్ని ఓ సరికొత్త లుక్‌లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు.
ఇప్పటికే విడుదలైన ‘ఈ రాతలే..’ పాటకి చక్కటి స్పందన లభించింది. మంచి మెలోడీగా సాగే ‘నగుమోము తారలే..’ పాట కూడా అందరినీ అలరించేలా ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని అంటున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది.