Raashi Khanna : తెలుగు ప్రేక్షకులకు రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఊహలు గుసగుసలాడే చిత్రంతో పరిచయం అయింది. ఎంతో అందం, అంతకు మించిన అభినయం ఈమె సొంతం. ఈ క్రమంలోనే ఈ భామ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఢిల్లీకి చెందిన ఈమెకు ప్రస్తుతం ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే అందాతోనూ ఆకట్టుకుంటోంది. ఇక తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాల్లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈమె బిజీ గా మారింది. ఇప్పటి వరకు ఆమె సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లలో నటించింది. నటనలో ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే స్టార్ హీరోలతో చేయకపోయినా ఈమె తన నటనతో, అందంతో అభిమానులను సంపాదించుకుంటోంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. తనకు రొమాంటిక్ సీన్స్‌లో నటించడం అంటే చాలా ఇష్టమని చెప్పేసింది.
కాగా రాశి ఖన్నా తాజాగా గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ అనే మూవీలో నటించింది. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ లభిస్తోంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు అంటున్నారు. ఇక సినిమాకు చెందిన ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈమె ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తోంది.

తనకు ఎలాంటి సినిమాల్లో నటించడం అంటే ఇష్టం అని అడగ్గా.. రొమాంటిక్ మూవీలు అంటే ఇష్టం అని ఓపెన్ గా చెప్పేసింది. అలాగే కామెడీ మూవీలను చూసి ఎంజాయ్ చేస్తానని చెప్పింది.
ఇక రాశిఖన్నా కెరీర్ మొదట్లో కన్నా ఇప్పుడే గ్లామర్ షోను ఎక్కువగా చేస్తుందని చెప్పవచ్చు. తాజాగా ఈమె కేక పెట్టించే అందాలతో ఫొటోషూట్ చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ఈక్రమంలోనే ఈమెకు చెందిన లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రాశిఖన్నాను ఈ విధంగా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతగా గ్లామర్ షో చేస్తుందేమిటని అంటున్నారు. ఈ క్రమంలోనే రాశి ఖన్నా ఫొటోలను చూసి కుర్రకారు ఎంజాయ్ చేస్తున్నారు.