Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు విడుదల అయ్యి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
డిసెంబర్ 17న సినిమా విడుదల చేయనున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సునీల్ మంగళం సీను పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే సునీల్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సునీల్ భిన్నమైన లుక్ లో కనిపిస్తుండడం విశేషం. సునీల్‌కు చెందిన ఈ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.
#MangalamSrinu from #PushpaTheRise 🔥
Thank You Sukku darling and Allu Arjun garu for the opportunity❤️#Sunil #PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku @MythriOfficial @ThisIsDSP pic.twitter.com/FxmB2PdYUA
— Suneel (@suneeltollywood) November 7, 2021
ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి. ఇందులో అనసూయ కీలకపాత్రలో సందడి చేయనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక డి గ్లామర్ లుక్ లో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో భారీ మాస్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం సుకుమార్ ఏకంగా 1000 మంది డాన్సర్లను రంగంలోకి దించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎంతో హైలెట్ అయిందని చెప్పవచ్చు.