Pushpa Movie : అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో బన్నీ, రష్మిక ఇద్దరూ డీగ్లామర్ రోల్స్‌లో నటించి అదరగొట్టేశారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. ఈ క్రమంలోనే హిందీ మార్కెట్‌లో పుష్ప మూవీ అప్పట్లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే బన్నీతోపాటు రష్మికకు కూడా ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాల్లో నటించాలని బీటౌన్ మేకర్స్ ఇప్పుడు వీరి వెంట పడుతున్నారు.
అయితే పుష్ప సినిమాలో అనేక సీన్లు హైలైట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. అందువల్లే మూవీ చాలా హిట్ అయింది. ఇక ఆ సీన్లలో పుష్ప ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే సీన్లు అయితే బాగా పేలాయి. ముఖ్యంగా వాటిల్లో పోలీసులు వస్తున్నారని తెలిసినప్పుడు పుష్ప వెంటనే ఎర్ర చందనం దుంగలను నదిలో పడేయిస్తాడు. తరువాత రిజర్వాయర్ గేట్స్‌ను లాక్ చేసి అక్కడ నుంచి ఆ దుంగలను బయటకు తీయిస్తాడు. ఈ క్రమంలోనే ఈ సీన్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. అంత భారీ స్థాయిలో ఉన్న దుంగలను పుష్ప ఎలా దాస్తాడు.. పోలీసులకు అతను పట్టుబడక తప్పదా.. అని ప్రేక్షకులు ఖంగారు పడతారు. కానీ అంతలోపే పుష్ప రాజ్ మాయ చేస్తాడు. దీంతో పోలీసుల బారిన పడకుండా సురక్షితంగా తప్పించుకుంటాడు. ఇలా పుష్పలోని ఎర్ర చందనం దుంగల సీన్ ముగుస్తుంది. అయితే ఈ సీన్‌ను సుకుమార్ కాపీ కొట్టాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే..

అప్పట్లో తమిళ హీరో విజయ్‌కాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ మూవీ గుర్తుందా. ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అయి రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీలోనూ అచ్చం పుష్ప లాంటి సీనే ఒకటి ఉంటుంది. అందులో ఎర్ర చందనం.. ఇందులో గంధం చెక్కలు.. అంతే తేడా. వాటిని విలన్ నదిలో పడేసి స్మగ్లింగ్ చేస్తాడు. అయితే పుష్పలో మాత్రం పోలీసులు హీరోను పట్టుకోలేకపోతారు. కానీ ఇక్కడ హీరో.. విలన్‌ను పట్టుకుంటాడు. అంతే తేడా.. కానీ సీన్ మాత్రం ఒకేలా ఉంటుంది. మీరు చూస్తే మక్కీకి మక్కీ సేమ్ ఉంటుందని అంటారు. అయితే సుకుమార్ నిజంగానే కెప్టెన్ ప్రభాకర్ మూవీ నుంచి గంధపు చెక్కల స్మగ్లింగ్ సీన్‌ను కాపీ చేశారా.. లేదా.. అన్న విషయం తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.