Liger Movie : భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసిందని చెప్పవచ్చు. కొన్ని సార్లు దర్శక నిర్మాతలు సినిమా కథాంశాన్ని హైలెట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడతారు. వీరు చేసే హంగులు ఆర్భాటాలు సినిమాకి ప్లస్ కావడం కన్నా ఒక్కోసారి మైనస్ గా మిగులుతాయి. ఇప్పుడు లైగర్ చిత్రంలో పూరీ జగన్నాథ్ చేసింది కూడా అదే పని.
లైగర్ చిత్రంలో మైక్ టైసన్ అప్పియరెన్స్ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది అనుకున్నారు. అసలు చెప్పాలంటే లైగర్ మూవీకి మైక్ టైసన్ పాత్ర అవసరం లేదు. కానీ మా సినిమాలో మాజీ వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్ నటించాడని గొప్పగా చెప్పుకోవడానికి ఆయన్ని తీసుకొచ్చి సినిమాకు అతికించారు. మైక్ టైసన్ పాత్రను ఎందుకు అతికించారో అర్థంకాక థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. మైక్ టైసన్ గురించి తెలిసిన వాళ్ళు సినిమాలో ఆయన పాత్ర గురించి భారీగా ఊహించుకుంటే.. తెలియనివాళ్ళు మాత్రం ఈయన ఎవరు.. అసలు కథలోకి ఎందుకు వచ్చారు.. అని ఆలోచిస్తున్నారు.
కథలో కంటెంట్ వీక్ గా ఉండడం, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేమ కథను జోడించి మరో తప్పు చేయడం, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేది విజయ్ దేవరకొండ డైలాగ్స్ కోసం అయితే సినిమాలో విజయ్ కి నత్తిగా మాట్లాడే విధానాన్ని పెట్టి సినిమాను చెత్త చెత్త చేయడం వంటివన్నీ మైనస్ పాయింట్లు. సినిమాకి ప్లస్ అవుతారు అనుకున్న మైక్ టైసన్ పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సినిమాకు భారంగా మారిన మైక్ టైసన్ పాత్ర నిర్మాతలకు బడ్జెట్ పరంగా కూడా భారమైంది. మైక్ టైసన్ కి పూరీ టీం రూ.40 కోట్ల వరకు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ రూ.20 నుండి రూ.25 కోట్లు ఇచ్చారని బాలీవుడ్ మీడియా హంగామా రిపోర్ట్ వెల్లడించింది. మరొక లెక్క ప్రకారం మైక్ టైసన్ నెట్ రూ.15 కోట్లు తీసుకున్నారని, ఆయన టీంతోపాటు షూటింగ్ ఖర్చులు కలిపి రూ.25 కోట్లు అయ్యిందని సమాచారం వినిపిస్తోంది.
లైగర్ చిత్రంలో నిర్మాతలు మైక్ టైసన్ కోసం పెట్టిన మొత్తం వృథా అయిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో చిత్రం చేయాలన్న ఆలోచనతో మన ప్రజల ఊహ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయాడు పూరీ జగన్నాథ్. నీ స్టైల్ లో మన వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు చేసినా చిత్రం సక్సెస్ సాధించి ఉండేది. బాలీవుడ్ రేంజ్ లో ఊహించుకొని లేనిపోని హంగులు ఆర్భాటాలతో చిత్రాన్ని నిర్మించి నీ గొయియ నువ్వే తవ్వుకున్నావు. నీ ఒరిజినల్ టాలెంట్‌ని బయటకి తీయకపోతే త్వరలో తెలుగు ప్రేక్షకులు నిన్ను డైరెక్టర్ అనే విషయమే మర్చిపోతారు. ఒక ఇడియట్, పోకిరి తరహాలో చిత్రాన్ని మళ్లీ ఎప్పుడు చూపిస్తావో.. అంటూ నెటిజన్లు పూరీని తెగ ట్రోల్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…