Chiranjeevi On Acharya : ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది అపోహ మాత్రమేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారం ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని తెలిపారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లాను. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందన్నారు. అలాగే సినిమా డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద స్టార్లు.. వారి కాల్షీట్లు దొరికితే హడావుడిగా సినిమాలు చేయోద్దని డైరెక్టర్లకు సూచించారు. డైరెక్టర్లు సినిమా విషయంలో బాగా కసరత్తు చేయాలన్నారు.
కంటెంట్ ఉంటే జనం తప్పకుండా సినిమా చూసేందుకు థియేటర్‌కు వస్తారన్నారు. అందుకు లేటెస్ట్ గా వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలే ఉదాహరణ. కంటెంట్ లేకపోతే సినిమా రెండో రోజే పోతుంది. అందులో నేను కూడా ఓ బాధితుడినే. దర్శకులే మూవీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్. సినిమాలో ఎమోషన్ అనేది చాలా ముఖ్యం. లేదా ఊపిరి సలపని ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. ఉదాహరణకు అనుదీప్ ఇచ్చిన జాతిరత్నాలు. ఆ విధంగా దర్శకులు కథలపై ఫోకస్ పెట్టాలి. ఆర్టిస్టుల డేట్స్ వచ్చేస్తున్నాయని హాడావుడి పడిపోయి.. ఏదో ఒకటిలే ముందు బండి ఎక్కించేద్దామనే ఆలోచన వద్దు.
ఎందుకంటే దర్శకులపై ఎంతో మంది టెక్నీషియన్స్.. బయ్యర్స్.. ఇతరులు ఆధారపడి ఉంటారు. జయాపజయాలు మన చేతిలో లేకపోయినా, హిట్ చేయాలనే ఆలోచనతోనే దర్శకులు కంటెంట్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు చిరంజీవి. ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టం శెట్టి డైరెక్ట్ చేశారు. జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్‌పై ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీని నిర్మిస్తున్నారు. ఏడిద శ్రీరామ్ చిత్ర సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 2న సినిమా రిలీజ్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…