Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈయన సినిమాలో కథ పెద్దగా ఉండదు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్, అలాగే హీరో క్యారెక్టరైజేషన్ తో సినిమాని నడిపిస్తాడు. స్క్రీన్ ప్లే కూడా మంచి స్పీడ్ గా ఉంటుంది. తమ హీరోని పక్కా కమర్షియల్ యాంగిల్ లో చూసి దమ్మున్న డైలాగులు పలకాలి అంటే, అది పూరీ డైరెక్షన్ లోనే కుదురుతుంది అని బలంగా నమ్ముతారు. ఇది ఇలా ఉంటే పూరీ జగన్నాథ్ ఒక హీరోతో చేయాలనుకున్న సినిమాను వేరే హీరోలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నిర్మించాలని కూడా పూరీ ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబీ హీరోగా జై లవకుశ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథ ఏదో తేడా కొడుతుండటంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది.
ఇడియట్ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తీయాలని అనుకున్నాడు పూరీ. పండు గాడుగా పవన్ కళ్యాణ్ ని పెట్టాలనుకున్నాడు పూరీ. కానీ మహేష్ తో ఈ సినిమా చేశాడు. లైగర్ మూవీని మహేష్‌బాబుతో పూరీ చేయాలని అనుకున్నాడు. కానీ లైగర్ స్క్రిప్ట్ కు మహేష్ నో చెప్పాడు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను మహేష్ బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో ఇస్మార్ట్ శంకర్ చేయాలని అనుకుని రామ్ తో చేశాడు.
పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మనను సూర్యతో కూడా చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. పూరీ తన కొడుకుతో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీయాలని భావించాడు కానీ చివరికి రామ్ పోతినేనితో చేశాడు. బిజినెస్ మెన్ సినిమాను మొదట సూర్యతో చేయాలని అనుకుని.. మహేష్ తో తీశాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిని రవితేజ కంటే ముందు శ్రీరామ్ హీరోగా చేయాలని అనుకున్నాడు పూరీ. కానీ రవితేజతో చేసి హిట్ కొట్టాడు. ఇలా పూరీ అనుకున్న సినిమాలను మొదట తాను చేయాలనుకున్న హీరోలతో కాకుండా వేరే హీరోలతో చేయడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…