Puneeth Rajkumar : గత ఏడాది కన్నడ నటుడు చిరంజీవి గుండెపోటుతో కన్నుమూయగా, ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. పునీత్ రాజ్‌కుమార్ మంచి కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండేవారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే కాకుండా సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలను కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు.
ఆయన 29 సినిమాల జర్నీలో కొన్ని తెలుగు రీమేక్‌లను కూడా చేశారు. చివరిగా యువరత్న చిత్రంతో ప్రేక్షకులని పలకరించారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో హీరోగా 30వ చిత్రం ఖరారయ్యింది. దాని షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. చేతన్ కుమార్ దర్శకత్వంలో ప్రియా ఆనంద్, పునీత్ రాజ్‌కుమార్ జంటగా నటిస్తున్న చిత్రమే ‘జేమ్స్’. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే స్టేజ్‌కు చేరుకుంది. ఇంతలోనే ఊహించని నష్టం జరిగింది.
జేమ్స్ తర్వాత ఒక పాన్ ఇండియా చిత్రానికి సైన్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. ‘ద్విత్వ’ అనే టైటిల్‌తో ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. యంగ్ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందాల్సి ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉండగా,ఇప్పుడు ప్రారంభం కాకుండానే ద్విత్వ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పునీత్.. చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో కూడా కనిపించాలని ఆశపడ్డాడట. ఇంతలోనే ఆయన కన్ను మూయడం అభిమానులను తీవ్ర విషాదంలో నింపింది.