Puneeth Rajkumar : కన్నడ సినీ ఇండస్ట్రీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే హార్ట్ ఎటాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించాడన్న విషయం తెలియడంతో ఎంతో మంది ప్రజలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఈ విషయం గుర్తుకు చేసుకున్నా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి బాలనటుడుగా పరిచయమైన పునీత్ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన బాగా వర్కౌట్లు చేస్తుంటారు. అలా ఓ రోజు హెవీ వర్క్ అవుట్ చేయడంతో ఛాతిలో నొప్పితో హాస్పిటల్ లో చేరగా వెంటనే ప్రాణాలు కోల్పోయారు.
ఈయన మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం మాత్రం కర్ణాటకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పునీత్ మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది ప్రజలు భయాందోళనలకు గురవుతూ గుండెకు సంబంధించిన టెస్టులు చేయించుకోవడం కోసం హాస్పిటళ్లలో క్యూ లు కడుతున్నారు. ఈ విషయం గురించి డాక్టర్లు కూడా తెలిపారు.
పునీత్ మరణం తర్వాత హాస్పిటల్ కు గుండె చెకప్ కోసం వస్తున్న వారి సంఖ్య 35 శాతం మేర పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ హాలిడే రోజు 1700 మంది చెకప్ చేయించుకున్నారని తెలిపారు. ఎంతో దృఢమైన శక్తి ఉన్న పునీత్ కే గుండె సమస్య రావటంతో తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ప్రజలు. ఇక ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారడంతో అందరూ షాకవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…