Prudhvi Raj : కమెడియన్ పృథ్వి.. ఈయననే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అని కూడా పిలుస్తారు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా ఆకట్టుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. అయితే గత కొంత కాలంగా పృథ్వీ సినిమాల్లో ఆఫర్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఈయన గతంలో వైసీపీలో చేరారు. ఓ పదవిలో కొనసాగారు. తరువాత ఆయనపై కొన్ని ఆరోపణలు రావడంతో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లోనే బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈయనకు కుమార్తె కూడా ఉంది. ఆమె ఇప్పుడు ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. ఈ మేరకు ఆ చిత్ర విశేషాలను పృథ్వి మీడియాతో పంచుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ పృథ్వి పలు విషయాలను వెల్లడించారు.
తన కుమార్లె శ్రీలు హోటల్ మేనేజ్‌మెంట్ చేసిందని.. మలేషియా వెళ్లి సెటిల్ కావాలని అనుకుందని తెలిపారు. అయితే డ్యాన్స్ మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుందని, నటనలోనూ ప్రతిభ చూపిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాల్లోని సన్నివేశాలను కూడా మిమిక్రీలా చేసి చూపిస్తుందని తెలిపారు. ఇక తన కుమార్తెని ఇండస్ట్రీకి ఘనంగా పరిచయం చేయాలని అనుకుంటున్నానని అన్నారు. అందులో భాగంగానే తన స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా.. కొత్త రంగు ప్రపంచం అనే సినిమాను నిర్మిస్తున్నారని అన్నారు. అందులో తన కుమార్తె హీరోయిన్ గా నటిస్తుందని తెలిపారు.
అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని పృథ్వి వివరించారు. ఇక శ్రీ ఆర్పీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తుందని.. దీన్ని దర్శకుడు అత్యంత ప్రతిభతో తెరకెక్కిస్తున్నాడని.. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుందని.. అప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని.. పృథ్వి తెలిపారు. ఇక తనను ఆదరించినట్లే తన కుమార్తెను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…