Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు ఇతర భాషలలోనూ దుమ్ము రేపుతున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డె. గత మూడేళ్ళుగా వరుస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. రీసెంట్‌గా రాధే శ్యామ్ మూవీతో పలకరించింది. రాధే శ్యామ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్డె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో డాక్టర్ పాత్రలో మంచి నటనే కనబరిచింది. ఈ సినిమా ఫెయిలైనా త్వరలో రాబోయే బీస్ట్, ఆచార్య మూవీలతో పాటు పలు బాలీవుడ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఫుల్ బిజీగా ఉంది. అయితే బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్‌గా పాల్గొంటుంది పూజా హెగ్డె.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డె జంటగా నటించిన సినిమా బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ వారు నిర్మించారు. తెలుగులోనూ బీస్ట్ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈనెల 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత దిల్‌రాజు పూజాహెగ్డెపై ప్రశంసల వర్షం కురిపించారు.
పూజా మన కాజా.. అంటూనే అడుగు పెడితే హిట్టే.. అంటూ ఆకాశానికెత్తేశారు. అంతేనా.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు డేట్స్ ఇవ్వమని కూడా అడిగేశారు. టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు హీరోయిన్ పూజా హెగ్డె గురించి ఇలా పొయెటిక్ గా చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పూజా హెగ్డెపై పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశంసలు కురిపించారు దిల్ రాజు. ఇక మన బుట్టబొమ్మ కూడా స్టార్ ప్రొడ్యూసర్ పొగడ్తలకు పొంగిపోయింది. అయితే దిల్ రాజు ఇలా అందరి ముందే పూజా హెగ్డెను అలా అనడం చాలా మందికి నచ్చలేదు. దీంతో నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త వైరల్ అవుతోంది.