Priyamani Bhama Kalapam Movie Review : ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ప్రియమణి వెండితెరపై వెలుగు వెలిగింది. అయితే వివాహం అయిన తరువాత ఈమె టీవీ షోలకే పరిమితం అయింది. అప్పుడప్పుడు సిరీస్‌లలో కూడా నటిస్తోంది. అలాగే ఈ మధ్య కొన్ని సినిమాల్లోనూ చేసింది. ఈక్రమంలోనే తాజాగా ఆమె నటించిన చిత్రం భామా కలాపం శుక్రవారం ఆహా ఓటీటీ యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆకట్టుకుందా, లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
కథ..
అనుపమ (ప్రియమణి) ఒక యూట్యూబర్. ఎల్లప్పుడూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈమెకు ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీంతో ఆమె ఒక రోజు తన పక్కింట్లో ఉన్న వారు గొడవపడుతుంటే వింటుంది. తరువాత ఒక రోజు ఆమె ఆ ఇంట్లోకి వెళ్లి అసలు సమస్య ఏంటి ? అని తెలుసుకోవాలని యత్నిస్తుంది. అయితే ఆమె ఒక హత్యా నేరంలో చిక్కుకుంటుంది. దీంతో ఆమెకు కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇక ఒక గ్యాంగ్‌స్టర్ కూడా ఆమె వెంటపడుతుంటాడు. మరి హత్యకు గురైంది ఎవరు ? ఎవరు చేశారు ? గ్యాంగ్‌స్టర్ ఆమె వెంట ఎందుకు పడ్డాడు ? ఆమె ఈ సమస్యల నుంచి ఎలా తప్పించుకుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. ఈ సినిమాను చూడాల్సిందే.
ఇందులో కథ చాలా బాగుంది. సింపుల్ స్టోరీ లైన్‌ను ఎంచుకున్నారు. గృహిణిగా ప్రియమణి బాగానే చేసింది. ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కనుక ఈ మూవీలోనూ తన పెర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గకుండా చేసింది. అలాగే ఈ మూవీలోని ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక విలువైన గుడ్డు చుట్టూ తిరుగుతుంది. కనుక సినిమా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.
అయితే సినిమా సెకండాఫ్‌లో సీరియస్‌నెస్ లోపించింది. దీంతో సినిమా తేలిపోయింది. ముఖ్యంగా హత్య కేసులో చిక్కుకున్న ప్రియమణి ప్రవర్తించే తీరు సరిగ్గా ఉండదు. అలాగే ప్రియమణి భర్త పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. ఇక విలన్ యాక్టింగ్ కూడా కొద్దిగా ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని సిల్లీ, లాజిక్ లేని సీన్లు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే భామా కలాపం ఒక మర్డర్ మిస్టరీని తలపిస్తుంది. ప్రియమణి నటన బాగుంది. కానీ కథను తెరపై సరిగ్గా చూపించలేకపోయారు. అయితే కొన్ని చోట్ల థ్రిల్లర్, మిస్టరీ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కనుక ఈ మూవీని ఒకసారి అయితే చూడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…