Anasuya : బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న నటి, యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై అనేక షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలే ఆమె నటించిన పుష్ప సినిమా విడుదల కాగా అందులో ఆమె దాక్షాయణి పాత్రలో అదరగొట్టింది. ఇక తాజాగా రవితేజ సినిమా ఖిలాడిలోనూ అనసూయ ఓ కీలకపాత్రలో నటించింది.
రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. రవితేజ ఇందులో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని సినిమా ట్రైలర్‌ను చూస్తే స్పష్టమైంది. ఇక ఈ మూవీలో డింపుల్ హయతి తల్లిగా అనసూయ చంద్రకళ పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ముచ్చట్లను అనసూయ పంచుకుంది.
ముఖ్యంగా అనసూయ రవితేజ గురించి మాట్లాడుతూ.. రవితేజతో కలిసి పనిచేయడాన్ని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని తెలిపింది. ఆయనతో ఎక్స్‌పీరియెన్స్ అదిరిందని, ఆయన ఒక ఉత్తమమైన నటుడని, ఆయనను చూస్తే తనకు ప్రాణాయామం చేసిన ఫీలింగ్ కలిగిందని అనసూయ చెప్పుకొచ్చింది. ఈ మూవీ కోసం రవితేజతో కలిసి చాలా రోజుల పాటు నటించినా.. ఆయన ఇంత ఎనర్జిటిక్ గా ఎలా ఉంటారో తెలుసుకోలేకపోయానని.. ఆ విషయం కూడా తెలుసుకుంటానని స్పష్టం చేసింది.
ఇక ఈ మూవీకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించగా ఎ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. అలాగే సీనియర్ హీరో అర్జున్ కీలకపాత్రలో నటించారు. ఇందులో రవితేజ డ్యుయల్ షేడ్‌లో నటించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…