Priya Prakash Varrier Wink : ప్రియా ప్రకాష్ వారియర్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆ మాటకొస్తే ఈమె భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రేక్షకులు అందరికీ తెలుసు. అంతగా ఈమె పాపులర్ అయింది. సినిమా రిలీజ్‌కు ముందే అత్యంత పాపులారిటీని సంపాదించిన సెలబ్రిటీలలో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈమె తన 18వ ఏటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఈమె కన్ను గీటిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. 2018లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈమె నటించిన తొలి మూవీ ఒరు అదర్ లవ్‌లోని మాణిక్య మళరాయా పూవి అనే పాటకు చెందిన ప్రోమోను లాంచ్ చేశారు. అందులో ఈమె కన్ను గీటే సీన్ ఉంటుంది. దాంతో ఈమె ఓవర్ నైట్ స్టార్ అయింది. అప్పటికి ఒరు అదర్ లవ్ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కానేలేదు. ఆ తరువాత ఏడాదికి సినిమా రిలీజ్ అయింది. కానీ అప్పటికే ఈమె స్టార్‌గా మారింది.
ఇలా సినిమా రిలీజ్ కాకముందే స్టార్‌గా మారిన అతి తక్కువ సెలబ్రిటీల్లో ఒకరిగా కూడా ప్రియా ప్రకాష్ వారియర్ పేరుగాంచింది. ఆ ఏడాదికి గాను భారత్‌లో గూగుల్‌లో అత్యంత ఎక్కువ సెర్చ్ చేయబడిన సెలబ్రిటీగా ఆమె నిలిచింది. సాధారణంగా ఈ జాబితాలో మోదీ, సన్నీ లియోన్‌లు ఉంటారు. కానీ ప్రియా ప్రకాష్ వారియర్ వారిని కూడా దాటేసి టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. అయితే అంత బాగా పాపులర్ అయినప్పటికీ ఆమె తొలి మూవీ ఒరు అదర్ లవ్ హిట్ కాలేదు. తరువాత ఈమెకు పలు మూవీల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక్క హిట్ కూడా పడలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఈమధ్యే పలు గ్లామరస్ ఫొటోలను కూడా ఈమె షేర్ చేసింది. దీంతో అవి వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమాలు చేతిలో ఏమీ లేకపోయినా.. అందాల ప్రదర్శనకు మాత్రం కొదువ లేకుండా చేస్తోంది ప్రియా ప్రకాష్ వారియర్.

ప్రియా ప్రకాష్ వారియర్ అప్పట్లో కన్ను గీటిన వీడియోను చాలా మంది ఇమిటేట్ చేశారు. మీమ్స్, వీడియోలు, రీల్స్ చేశారు. కొన్ని సినిమాల్లోనూ రిఫరెన్స్‌గా వాడారు. చాలా మంది నటీనటులు సైతం ఈ వీడియోను కాపీ చేశారు. ఇక అప్పట్లో పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం ప్రియా ప్రకాష్ వారియర్‌ను ఇమిటేట్ చేశారు. ఆయన అమాంతం లేచి ప్రధాని మోదీని ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇలా ప్రియా ప్రకాష్ వారియర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
https://youtu.be/wvN0IiBu–E
ఈమె విమల కాలేజ్‌లో బి.కామ్ పూర్తి చేసింది. తన ఫేవరెట్ హీరో రణవీర్ సింగ్. ఆయనతో కలసి పనిచేయాలని ఆమె కోరిక. ఆమె యాక్ట్ చేసిన ఒరు అదార్ లవ్‌లోని కన్ను గీటిన పాట వీడియో అప్పట్లోనే 90 లక్షల వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో ఓవర్‌నైట్‌లోనే ఆమెకు 6 లక్షల మంది ఫాలోవర్లు వచ్చి చేరారు. ప్రముఖ హాలీవుడ్ స్టార్ కైలీ జెన్నర్, ఫుట్‌బాల్ ప్లేయర్ రొనాల్డో తరువాత ఆ ఫీట్‌ను సాధించిన సెలబ్రిటీగా ప్రియా ప్రకాష్ వారియర్ నిలిచింది. ఈమె మంచి యాక్టర్ మాత్రమే కాదు.. చక్కగా పాడగలదు కూడా. క్లాసికల్ డ్యాన్స్ కూడా చేస్తుంది. అయితే ఇన్ని అర్హతలు, నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఈమె ఎందుకో సినిమాల్లో రాణించలేకపోతోంది. ఈమె నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇక ముందు అయినా ఈమె హిట్ కొడుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.