Priya Prakash Varrier : సినీ నటులు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అందరి ముందు అవమానం చెందాల్సి వస్తుంటుంది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కు కూడా పెద్ద అవమానమే జరిగింది. ఆమెకు ఓ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే..
ప్రియా ప్రకాష్ వారియర్ ముంబైకి షూటింగ్ నిమిత్తం వెళ్లింది. అక్కడ ఆమెకు ఫెర్న్ గోరెగావ్ హోటల్‌లో రూమ్స్ బుక్ చేశారు. అయితే ఆ హోటల్‌లోకి బయటి ఫుడ్‌ను అనుమతించరు. అక్కడే ఏదైనా కొనుగోలు చేసి తినాల్సి ఉంటుంది.
ఈ విషయం తెలియని ప్రియా.. తాను షూటింగ్ నుంచి హోటల్ రూమ్‌కు వస్తూ.. మధ్యలో ఫుడ్ కొనుగోలు చేసింది. దాన్ని హోటల్ రూమ్‌లో తినొచ్చని ఆమె భావించింది. కానీ హోటల్ పాలసీ ప్రకారం బయటి ఫుడ్‌ను అనుమతించరు కనుక.. వారు ఆమెను ఆ ఫుడ్‌ను తీసుకెళ్లనివ్వలేదు. ఫుడ్ పడేస్తే బయట పడేయండి.. లేదంటే బయటే ఉండి తినండి.. కానీ లోపలికి మాత్రం ఫుడ్‌ను అనుమతించబోము.. అంటూ ఆ హోటల్ వారు ఆమెకు ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ప్రియా చేసేది లేక బయట చలిలోనే నిలబడి ఫుడ్‌ను తిన్నది.
ఇక ఈ విషయాన్ని ఆమె సోషల్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాను ఫుడ్‌ను ముందుగానే ఆర్డర్ చేసుకున్నానని, ఆ హోటల్‌లోకి బయటి ఫుడ్ అనుమతి లేదనే విషయం తనకు తెలియదని, అయితే కొన్న ఫుడ్ ను వృథాగా పడేయడం ఇష్టం లేకే హోటల్ బయట చలిలో అలాగే నిలబడి ఫుడ్ తిన్నానని చెప్పుకొచ్చింది. ఈ ఒక్కసారికి వదిలేయమని తాను రిక్వెస్ట్ చేసినా ఆ హోటల్ వారు పట్టించుకోలేదని, పెద్ద సీన్ క్రియేట్ చేశారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఆమె తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని, అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
కాగా ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవలే నితిన్‌తో కలిసి చెక్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ ఈమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. దీంతో ఇప్పటికీ ఈమె మంచి హిట్ కోసం వేచి చూస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…