Priya Anand : భారతీయులకు.. అందులోనూ దక్షిణాది వారికి నిత్యానంద స్వామి గురించి బాగా తెలుసు. ఈయన అప్పట్లో తన ప్రవచనాలతో ఎంతో మంది భక్తులను సొంతం చేసుకున్నారు. అయితే ఈయన లీలలు ఎక్కువైపోయాయి. అప్పట్లో ఈయన పాల్పడిన అకృత్యాలకు గాను ఈయనపై ఫిర్యాదులు ఎక్కువై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఈయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే ఇక అరెస్టు చేయడమే తరువాయి అనుకుంటున్న సమయంలో దేశం విడిచి పారిపోయాడు. తరువాత ఎక్కడో దీవి కొనుక్కుని దానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దానికి సొంత భాష, కరెన్సీ తదితర అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నిత్యానందుడు ప్రస్తుతం మన దేశంలో లేకపోయినా తరచూ వార్తల్లో అయితే నిలుస్తున్నాడు.
తాజాగా ఈయన మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అది ఈయన వల్ల కాదు.. ఒక హీరోయిన్ వల్ల. అవును.. మీకు ప్రియా ఆనంద్ తెలుసు కదా. అప్పట్లో ఈమె రానా నటించిన లీడర్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవేవీ హిట్ కాలేదు. దీంతో ఈమె సినిమాలకు దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు కూడా పెద్దగా లేవు.
అయితే ప్రియా ఆనంద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందుడిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిత్యానంద అంటే తనకు బాగా ఇష్టమని చెప్పింది. అంతేకాదు.. ఆయనను పెళ్లి చేసుకుంటానని కూడా తెలియజేసింది. దీంతో ఉన్నట్లుండి ఈమె చేసిన కామెంట్స్‌కు అందరూ షాకవుతున్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఈమె ఇంత ఓపెన్‌గా చెప్పిందేమిటా.. అని అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఆమె అలా ఎందుకు మాట్లాడిందని చర్చించుకుంటున్నారు. అవున్లే.. ఎవరికి ఎవరు నచ్చుతారో ఎవరికీ తెలియదు కదా.. ఎవరిష్టం వారిది.. ఎవరినీ ఏమీ అంటానికి లేదు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…