Adavi Donga : మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. తన 152 సినిమాల్లో ఫ్లాప్ లు తక్కువే. చిరంజీవితో సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ అన్న ధీమా ఉండేది. కనుకనే ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక అప్పట్లో ఎన్‌టీఆర్ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ సమయంలో చిరంజీవి వరుస సినిమాలతో హిట్లు కొట్టి టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ అయ్యారు.
చిరంజీవి అడవి దొంగ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదట్లో ఈ సినిమాపై ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఆయన అప్పటికి ఇంకా స్టార్ కాలేదు. పైగా సినిమా మొత్తం చాలా వరకు చిరంజీవి మాట్లాడరు. దీంతో సహజంగానే కాస్త నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను అదే మూవీ ప్రేక్షకులకు నచ్చింది. దీంతో థియేటర్లు ఫుల్ అయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు చిరంజీవి విజేత సినిమాతో హిట్ కొట్టారు. ఆ మూవీ తరువాత నెలరోజులకే అడవి దొంగ వచ్చేసింది. ఇది కూడా హిట్ అయింది.
ఇక అడవిదొంగ సినిమా తెలుగులో టార్జాన్ నేపథ్యంలో వచ్చిన మొదటి సినిమా. దీంతో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి రూ.50 లక్షలు బడ్జెట్ కాగా.. మొత్తంగా రూ.4 కోట్ల షేర్‌ని వసూలు చేసింది. అప్పట్లో ఈ మొత్తం బాగా ఎక్కువ. అడవి దొంగ మూవీ రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.80 లక్షలకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. అలాగే హైదరాబాద్‌లో ఏకంగా 5 థియేటర్లలో 5 షోలను ఏకధాటిగా చాలా రోజులపాటు ప్రదర్శించారు. ఇలా అడవిదొంగ మూవీ అప్పట్లో ఎన్నో రికార్డులను సృష్టించింది. చిరంజీవిని మెగాస్టార్‌గా నిలబెట్టడంలో దోహదపడింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…