Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత వాడి, వేడిగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విష్ణు ప్యానెల్ గెలిచిన తర్వాత ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ముందు నుండి ఎన్నికలు సరిగ్గా జరగలేదని ప్రకాశ్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు.
ఎన్నికల హాల్‌లోకి వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ.. ప్రశ్నల వర్షం కురిపించారు ప్రకాశ్ రాజ్. మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తులు అక్కడకు వచ్చారని, బయటి వ్యక్తులు అక్కడ ఇబ్బందులు పెట్టారంటూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్లు చెప్పారు. రౌడీ షీటర్ నూకల సాంబశివరావు కూడా ఆ ప్రదేశంలో ఉన్నాడని, అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేయనున్నట్లు ప్రకాష్ రాజ్ చెప్పారు.
తాజా పరిణామంతో ఇండస్ట్రీలో మా ఎలక్షన్ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడు విష్ణు మంచు ప్యానెల్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ‘మా’ ఎన్నికల్లో అసలు రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోలేదని రెండు ప్యానెల్స్‌కు సంబంధించిన సభ్యులు తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ఆధారాలతో చూపించడంతో సరికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…