Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సీజన్ 5 కొనసాగుతోంది. 19 మంది సభ్యులతో షో మొదలు కాగా, ప్రతివారం ఒకరు చొప్పున ఇప్పటికే ఆరుగురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ల నుంచి ఇప్పుడు ఒకరిని షోలోకి తీసుకు వస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ రీఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు ? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారంలో శ్వేతా వర్మలు ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం తొమ్మిది మంది సభ్యులు నామినేట్ కాగా అందులో అనీ మాస్టర్ లేదా లోబో ఎలిమినేట్ కానున్నాడని అంటున్నారు.
అయితే హౌజ్‌లో సగం మంది అమ్మాయిలు బయటకు పోవడంతో గ్లామర్ డోస్ తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే ఓ ఫీమేల్ కంటెస్టెంట్‌తో రీఎంట్రీ ఇప్పించాలని బిగ్ బాస్ నిర్వహకులు ప్లాన్ చేసినట్లు తాజాగా బుల్లితెర వర్గాల్లో ఓవార్త తెగ వైరల్ అవుతోంది. ఎవరు వస్తే బాగుంటుందని కొందరు పోల్స్ కూడా పెడుతున్నారు. హమీదాని తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతుందని చాలా మంది అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…