Prakash Raj : తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల హడావిడి ఎట్టకేలకు ముగిసింది. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. అయితే మా ఎన్నికలలో తాను ఓడిపోవడంపై ఆవేదన చెందిన ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
నేను తెలుగువాడిని కాదు.. అతిథిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తాను అసోసియేషన్ నుంచి బయటికి వచ్చానని. నటించవద్దని ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి.. యథావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని వివరించారు. తనను నాన్ లోకల్ అన్నారని.. అతిథిగా ఉంటేనే గౌరవిస్తామన్నారు.. తనకు ఆత్మాభిమానం ఉందని. అందుకే బయటకు వస్తున్నట్టు తెలియజేశారు.
అసోసియేషన్ బయటకు వచ్చినా సినిమాలు చేస్తాను. ‘మా’తో 21 ఏళ్ల అనుబంధం ఉందన్న ప్రకాష్ రాజ్.. ఈరోజుతో ఆ బంధానికి తెరదించుతున్నట్లు ప్రకటించారు. ఓటమిని జీర్ణించుకున్నాక అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపును స్వాగాతిస్తున్నానని ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.
కాగా ప్రకాశ్ రాజ్‌కి సపోర్ట్ చేసిన నాగబాబు మా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…