Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య బాబు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్‌టైనర్ అఖండలో కథానాయికగా నటించింది. ఈ సినిమా కోసం ప్రగ్యా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అయితే రీసెంట్‌గా ఈ అమ్మడు కరోనా బారిన పడింది. నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇంతకు ముందు కరోనా బారిన పడ్డాను. ఇప్పడు మళ్లీ కరోనా వచ్చింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ప్రగ్యాకి కరోనా అని చెప్పడంతో ఆమె టీం అంతా ఆందోళన చెందారు.
NEGATIVE 🎉🎉
Never has this word made me happier 😂😭❤️🧿 pic.twitter.com/42ZBYNLlVi— Pragya Jaiswal (@ItsMePragya) October 18, 2021
తాజాగా ప్రగ్యా జైస్వాల్ గుడ్ న్యూస్ చెప్పింది. నెగిటివ్ అనే పదం ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ తనను సంతోష పెట్టలేదు.. అంటూ ట్వీట్ చేసింది ప్రగ్యా జైస్వాల్. అంటే తనకు కరోనా నెగెటివ్ అని కన్‌ఫాం అయిందని తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ 10వ తేదీన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రగ్యాకి కరోనా నెగెటివ్ అని తేలడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.