Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఇక ఈ అమ్మడు గతేడాది హీరోయిన్‌గా నటించిన అఖండ విషయానికి వస్తే.. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ సినిమా అన్ని అంచనాలను అందుకుని బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది.
అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రగ్యాకు కూడా మంచి విజయం దక్కింది. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా.. ప్రగ్యా కెరీర్ మాత్రం టర్న్ తీసుకోలేదు. ఈ సినిమా తరువాత ప్రగ్యా జైస్వాల్ కు తిరుగుండదు. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని అనుకున్నారు ఆడియన్స్.. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ రావడం లేదు. ఇక సినిమాలతో పెద్దగా సందడి చేయకపోయినా తన క్యూట్ క్యూట్ అందాలతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది ప్రగ్యా. రకరకాల యాంగిల్స్ లో పరువాల విందు చేస్తుంది.

వరుస ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సైమా అవార్డ్స్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా క్యూట్ అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంది. చిరునవ్వులు చిందిస్తూ.. కురులతో మన్మథ బాణాలు వేయాలని చూస్తోందీ బ్యూటీ.. చీరకట్టులో ఆమె అందాలు కనిపించి కనిపించకుండా.. కవ్విస్తుంటే ఎవరైనా అదరహో అనాల్సిందే. ఎద అందాలు కవ్విస్తూ.. కాకరేపుతున్నాయి. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్స్ వావ్ బ్యూటీఫుల్, ఆసమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram