Pragya Jaiswal : మిర్చిలాంటి కుర్రాడే సినిమాతో తెరంగేట్రం చేసిన హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. తొలి సినిమా ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు తీసుకురాలేదు. ఆకట్టుకునే అందం ఉన్నా.. బ్లాక్ బస్టర్ బొమ్మ పడలేదు. దీంతో టాలీవుడ్ భామల రేసులో కాస్త వెనుకబడింది. కంచె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలయ్యతో జోడీగా అఖండ సినిమా చేస్తోంది. తాజాగా చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్‌లో మెరిసింది ప్రగ్యా.

ఆ ఈవెంట్‌లో హోయలు పోతూ అటు సినిమా యూనిట్‌ని, ఇటు ఆడియెన్స్ ని కనువిందు చేసింది. ఈవెంట్‌కి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లూ డ్రెస్‌లో కనువిందు చేసిన ప్రగ్యా బిగువైన ఎద అందాలను చూపిస్తూ, నడుము వొంపుల్లోని ఘాటుని పరిచయంచేస్తూ క్యూట్ లుక్స్‌తో కేక పెట్టించింది. ప్రగ్యా జైస్వాల్ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.


ప్రగ్యా నటించిన అఖండ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌తోపాటు ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది.
